Narendra Modi : నేడు మోదీ గోవాలో దీపావళి వేడుకలు

దీపావళి వేడుకలను నేడు గోవా తీరంలో ప్రధాని నరేంద్ర మోదీ జరుపుకోనున్నారు

Update: 2025-10-20 04:25 GMT

దీపావళి వేడుకలను నేడు గోవా తీరంలో ప్రధాని నరేంద్ర మోదీ జరుపుకోనున్నారు. నేవీ సిబ్బందితో పండగ జరుపుకోనున్నారు. ఏటా దీపావళి వేడుకలను ఆర్మీ సిబ్బందితో ప్రధాని నరేంద్ర మోదీ జరుపుకుంటారు. గత కొద్ది రోజులుగా మోదీ సైనికుల వద్దకు వెళ్లి వారి నోటిని తీపి చేసి వారితో దీపావళి వేడుకను జరుపుకుంటూ వస్తున్నారు. నేడు మాత్రం గోవా తీరంలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఐఎన్ఎస్ విక్రాంత్ లో...
పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన ఈరోజు ఐఎన్ఎస్ విక్రాంత్ లో దిపావళి పండగను సైనికులతో జరుపుకోనున్నారు. గోవాతీరానికి ప్రధాని నరేంద్రమోదీ వస్తుండటంతో భారీ భద్రత ఏర్పాట్లను చేశారు. గోవా తీరంలో ఈ పండగ తనకు ప్రత్యేకమని ప్రధాని మోదీ తెలిపారు. దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.


Tags:    

Similar News