Sabarimala : శబరిమల బోర్డు కీలక నిర్ణయం.. వారికే అనుమతి

అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమల చేరుకుంటున్నారు.

Update: 2025-11-20 01:59 GMT

అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమల చేరుకుంటున్నారు. నిన్న తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన నేపథ్యంలో ట్రావెన్ కోర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24వ తేదీ వరకూ రోజుకు 75 వేల మంది వరకూ భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. మండల పూజలకు భారీగా భక్తులు తరలి వస్తుండటంతో కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రతి రోజూ 75 వేల మందినే...
ప్రతి రోజూ క్యూలైన్ ద్వారా 70 వేల మందిని, స్పాట్ బుకింగ్స్ ద్వారా ఐదు వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని పోలీసులు కూడా నిర్ణయించారు బుక్ చేసుకున్న తేదీల్లో భక్తులు శబరిమలకు రావాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కోరుతుంది. ఈ నెల 24వ తేదీ వరకూ ఇదే పద్ధతి శబరిమలలో కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కావున భక్తులు గమనించి శబరిమలకు వచ్చేందుకు ప్లాన్ చేసుకోవాలని కోరుతున్నారు.


Tags:    

Similar News