Sabarimala : శబరిమలకు పోటెత్తిన భక్తులు.. కిలోమీటర్ల మేర క్యూలైన్

శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు.

Update: 2025-11-18 03:18 GMT

శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. నిన్నటి నుంచి దర్శనాలు ప్రారంభం కావడంతో వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ఉండటంతో దర్శనానికి పదిహేను గంటల సమయం పడుతోంది. సరైన సౌకర్యాలు లేక భక్తులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 41రోజుల పాటు మండల పూజ జరుగుతంది.

నలభై ఒక్కరోజుల పాటు...
41రోజుల పాటు జరిగే మండల పూజ డిసెంబర్ 27వ తేదీన ముగుస్తుంది. అదే రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసేస్తారు. మళ్లీ డిసెంబర్ 30వ తేదీన మకరవిలక్కు కోసం ఆలయాన్ని తెరుస్తారు. 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అదే నెల 20న ఆలయాన్ని మూసివేస్తారు. మండల పూజకు భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుంది.


Tags:    

Similar News