Sabarimala : శబరిమలకు పోటెత్తిన భక్తులు

శబరిమలకు భక్తుల పోటెత్తారు.

Update: 2026-01-01 06:43 GMT

శబరిమలకు భక్తుల పోటెత్తారు. మకరవిలక్కు ఉత్సవాలు కొనసాగుతున్న వేళ శబరిమల సన్నిధానంలో నూతన సంవత్సరానికి ప్రశాంతంగా స్వాగతం పలికారు. అయ్యప్ప స్వామి ఆలయం వద్ద భద్రతా సిబ్బంది, భక్తులు కలిసి కొత్త ఏడాదిని ఆహ్వానించారు.సన్నిధానంలో విధులు నిర్వహిస్తున్న కేరళ పోలీసులు, ఫైర్ ఫోర్స్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది అర్ధరాత్రి ‘హ్యాపీ న్యూ ఇయర్’ అనే అక్షరాల ఆకారంలో ఏర్పాటు చేసిన కర్పూరాన్ని వెలిగించి కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. ముందుగా చాక్‌తో అక్షరాలు గీసి, వాటిపై కర్పూరం ఉంచారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు చీఫ్ పోలీస్ కోఆర్డినేటర్ ఏడీజీపీ ఎస్. శ్రీజిత్ కర్పూరాన్ని వెలిగించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.

ఆలయ తలుపులు తెరుచుకోవడంతో...
ఈ వేడుక అక్కడున్న అయ్యప్ప భక్తులను ఆకట్టుకుంది. పలువురు ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ‘స్వామి శరణం’ నినాదాలతో ఆ క్షణాన్ని మరపురాని దృశ్యంగా మార్చారు.మకరవిలక్కు ఉత్సవాల్లో భాగంగా శబరిమలకు భక్తుల రాక కొనసాగుతోంది. మండల పూజ అనంతరం డిసెంబర్ 30 సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరిచినప్పటి నుంచి డిసెంబర్ 31 సాయంత్రం 5.11 గంటల వరకు మొత్తం 1,20,256 మంది భక్తులు సన్నిధానానికి చేరుకున్నారు.సురక్షిత దర్శనానికి ట్రావెన్ కోర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఉత్సవ రోజుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా దర్శనం కల్పించేందుకు, భద్రతను పక్కాగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.






Tags:    

Similar News