షిర్డీ, వైష్ణోదేవి అలయాల రికార్డును అధిగమించిన అయోధ్య
ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలోని రామాలయంలో బాలరాముని దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా అయోధ్యకు తరలివస్తున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలోని రామాలయంలో బాలరాముని దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా అయోధ్యకు తరలివస్తున్నారు. ఇప్పుడు యూపీలో జరుగుతున్న కుంభమేళాకు వచ్చిన భక్తులు అయోధ్యకు వచ్చి, బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు. దీంతో అయోధ్య రాముడిని దర్శించుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
భారీ విరాళాలు ఇవ్వడంతో...
ఇక్కడకు వచ్చిన రామభక్తులంతా ఆలయానికి భారీగా విరాళాలు ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించుకుంటున్నారు. కానుకల విషయంలో అయోధ్య అటు షిర్డీ, ఇటు వైష్ణోదేవి అలయాలను మించిపోయింది. అయోధ్య రామాలయంలో బాల రాముని ప్రాణప్రతిష్ఠ 2024, జనవరి 22న జరిగింది. అప్పటి నుంచి నేటివరకూ 13 కోట్ల మంది బాలరాముణ్ణి దర్శించుకున్నారు. గత ఏడాదిలో ఆలయానికి కానుకలు, విరాళాల రూపంలో మొత్తం 700 కోట్ల రూపాయాలు అందాయి. మహాకుంభ్ ప్రారంభమయ్యాక రూ. 15 కోట్ల ఆదాయం సమకూరింది. దేశంలో అత్యధికంగా ఆదాయం అందుతున్న 10 ఆలయాలలో అయోధ్య మూడవ స్థానానికి చేరింది.