Delhi : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాపై దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాపై దాడి చేశారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న సమయంలో ఒక వ్యక్తి ఊహించని విధంగా దాడి చేశారు.

Update: 2025-08-20 04:33 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాపై దాడి చేశారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న సమయంలో ఒక వ్యక్తి ఊహించని విధంగా దాడి చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తన అధికార నివాసంలో ప్రతి రోజూ జన్ సున్ వాయ్ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ప్రజల నుంచి వారి సమస్యలపై వినతులను స్వీకరిస్తారు. దీంతో ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న సమయంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

జన్ సున్ వాయ్ కార్యక్రమంలో...
తొలుత కొన్ని పత్రాలను అతను ముఖ్యమంత్రికి ఇచ్చిన తర్వాత దాడికి పాల్పడినట్లు అంటున్నారు. అయితే ఎందుకోసం ఈ దాడి చేశారు? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తికి 35 సంవత్సరాల వయసు ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.


Tags:    

Similar News