Aravind Kejrival : నేడు బెయిల్ పై హైకోర్టులో విచారణ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
arvind kejriwal, chief minister, bail, supreme court
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ కేసులో ఇప్పటికే బెయిల్ వచ్చిందని కేజ్రీవాల్ కు సీబీఐ కేసులో కూడా బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరుపున న్యాయవాదులు వాదించనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ జూన్ 26న అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసింది. అయితే కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఎలాంటి ఇబ్బందులుండవని ఆయన తరుపున న్యాయవాదులు వాదిస్తుండగా, సీబీఐ తరుపున న్యాయవాదులు మాత్రం ఆయనకు బెయిల్ ఇవ్వవద్దంటూ తమ వాదనలు కొనసాగించనున్నారు.