kejrival : ఓటేసిన కేజ్రీవాల్.. ఏమన్నారంటే?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొద్దిసేపటి క్రితం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు

Update: 2024-05-25 06:18 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొద్దిసేపటి క్రితం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేజ్రీవాల్ తన భార్య, కుమార్తె, కుమారుడు, తండ్రిలో కలసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. కుటుంబ సభ్యులందరూ కలసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రతి ఒక్కరూ వచ్చి....
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన కేజ్రీవాల్ సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని ఏడు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ఆమ్ ఆద్మీపార్టీ అధినేత ఉన్నారు. ఓటు వేసిన అరవింద్ కేజ్రీవాల్ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపు నిచ్చారు.


Tags:    

Similar News