Delhi : ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

ఢిల్లీ వాయు కాలుష్యం పెరిగింది. గాలి నాణ్యత శుక్రవారం ఉదయం నాటికి ఎక్కువగా పెరిగిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది

Update: 2025-11-07 04:37 GMT

ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది. గాలి నాణ్యత శుక్రవారం ఉదయం నాటికి ఎక్కువగా పెరిగిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఉదయం 8 గంటలకు నమోదైన మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 312గా ఉంది. గురువారం ఇదే సమయానికి 271గా నమోదయిందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. ప్రజలు మాస్క్ లు ధరించి బయటకు రావాలని సూచించారు.

గాలి నాణ్యత పడిపోయి...
ఢిల్లీ నగరంలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయిందని కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. ఆనంద్‌ విహార్‌లో 332, అలీపూర్‌ 316, అశోక్‌ విహార్‌ 332, బవానా 366, బురారి క్రాసింగ్‌ 345, చాంద్ ని చౌక్‌ 354, ద్వారకా సెక్టార్‌–8లో 310, ఐటీఓ 337, జహంగీర్ పురిలో 342, ముండ్కా 335, నరేలా 335, ఓఖ్లా ఫేజ్‌–2 307, పట్పర్గంజ్‌ లో 314, పంజాబీ బాగ్‌ 343, ఆర్‌.కే.పురం 321, రోహిణి 336, సోనియా విహార్‌ 326గా నమోదయ్యాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని లేకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని తెలిపారు.


Tags:    

Similar News