Delhi : ఢిల్లీ వెళుతున్నారా.. అయితే అలెర్ట్ గా ఉండాల్సిందే
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించింది. చలి తీవ్రత పెరగడంతో వాయు కాలుష్యం పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించింది. చలి తీవ్రత పెరగడంతో వాయు కాలుష్యం పెరిగింది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అనేక ఆరోగ్యపరమైన ఇబ్బందులకు లోనవుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ వాయు కాలుష్యం ఢిల్లీ వాసులను వెంటాడుతుంది. ఢిల్లీ వెళ్లే ప్రజలు అలెర్ట్ గా ఉండాల్సిందే. చర్మ సంబంధింత రోగాలతో పాటు పలు ఆరోగ్యసమస్యలు తలెత్తే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీలో వరసగా గాలి నాణ్యత తగ్గుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఢిల్లీలో ప్రస్తుతం 370 గా నమోదయిందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పష్టం చేశారు. ఉదయం వేళ, సాయంత్రం వేళ ప్రజలకు బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
ఉదయం పొగమంచు...
ఉదయం పొగమంచు కుర్తుస్తుంది. మధ్యాహ్నం తర్వాత గాలివేగం పెరగడంతో కొంత ఉపశమనం లభిస్తున్నా వాయు కాలుష్యం మాత్రం ఢిల్లీని వదలడం లేదు. నిన్న ఉదయం 8 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఢిల్లీ 391గా ఉందని అధికారులు తెలిపారు. దీపావళి పండగ తర్వాత చలి తీవ్రత పెరుగుతుండటంతో పాటు పొగమంచు కమ్మేస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీతో పాటు ఢిల్లీలోనూ పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాలను దహనం చేస్తున్నకారణంగా వచ్చే కాలుష్య ప్రభావం కొంత తగ్గిందని అధికారుల తెలిపారు. అయితే ఈరోజు మాత్రం పశ్చిమ, నైరుతి దిశలుగా మారడంతో పంట వ్యర్థాల దహనం ప్రభావం తక్కువగా ఉందని అధికారులు తెలిపారు.
చలి తీవ్రత పెరగడంతో...
దీంతో పాటు నవంబరు నెల కావడంతో చలి కూడా ఎక్కువగా ఉంది. ఉదయాన్నే పొగమంచుతో పాటు వాయు కాలుష్యం, గాలి నాణ్యత క్షీణించడం వల్ల ప్రజలు పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా గుండె సంబంధిత వ్యాధులున్న వారు, దీర్ఘకాలిక రోగులు ఉదయం, రాత్రివేళల్లో బయటకు మాస్క్ లేకుండా రావద్దని సూచిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు మాస్క్ లు ధరించి రావడమే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. ఢిల్లీలోని పలు ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య ఇటీవల కాలంలో పెరిగిందని కూడా వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీకి వెళ్లే వారు కొన్ని రోజులు ఆగడం మంచిదని సూచిస్తున్నారు. పర్యాటకరంగంపై దీని ప్రభావం పడే అవకాశముంది.