కరూర్ తొక్కిసలాటలో 41 మందికి చేరిన మృతుల సంఖ్య
తమిళనాడు వెట్రి కళగం నేత విజయ్ ఎన్నికల ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య పెరిగింది
తమిళనాడు వెట్రి కళగం నేత విజయ్ ఎన్నికల ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య పెరిగింది. కరూరు జిల్లా వాసి సుగుణ శనివారం రాత్రి కన్నుమూశారు. ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆమె, చికిత్సకు స్పందించకపోవడంతో మృతి చెందారు. ఇప్పటివరకు 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 18 మంది మహిళలు, 13 మంది పురుషులు, ఐదుగురు చిన్నారి బాలికలు, ఐదుగురు చిన్నారి బాలురు ఉన్నారు.
మరికొందరి పరిస్థితి...
మృతులలో 34 మంది కరూర్ జిల్లా వాసులు. ఎరోడ్, తిరుప్పూర్, దండిగల్ జిల్లాలకు చెందిన ఇద్దరు చొప్పున ఉన్నారు. సేలంనుంచి ఒకరు మృతులలో ఉన్నారని అధికారులు తెలిపారు. ఇంకా వందల సంఖ్యలో గాయపడి చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా, మరికొందరు మాత్రం కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.