కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి

ఈ ప్రమాదంలో శిథిలాల కింద సుమారు 100 మంది చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా ప్రాంతంలో..

Update: 2023-07-20 10:59 GMT

Raigad Landslide Death Tolls

భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 12 మంది మృతి చెందిన విషాద ఘటన మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఖలాపుర్ సమీపంలోని కొండప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం పై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత అర్థరాత్రి రాయ్ గఢ్ జిల్లాలో భారీ వర్షం కురవగా.. ఇర్సల్ వాడి కొండపై ఉన్న గ్రామంలోని 30 ఇళ్లపై మట్టిపెళ్లలు, కొండరాళ్లు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదం ఇళ్లు నేలమట్టమవ్వగా.. 15-20 మంది మృతి చెంది ఉంటారని సీఎం ఏక్ నాథ్ శిండే తెలిపారు.

ఈ ప్రమాదంలో శిథిలాల కింద సుమారు 100 మంది చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా ప్రాంతంలో సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకూ 12 మంది మృతదేహాలను గుర్తించగా.. 22 మందిని శిథిలాల నుంచి రక్షించారు. పోలీసులు వాహనాల ద్వారా గ్రామంలోకి వెళ్లే దారి లేక నడకదారిలోనే ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మరోవైపు భారత వాతావరణ శాఖ రాయ్ గఢ్, పాల్ఘర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షసూచన నేపథ్యంలో రాయ్ గఢ్, రత్నగిరి, కొల్హాపూర్, సాంగ్లీ, నాగ్ పూర్, థానే జిల్లాలకు కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించింది.


Tags:    

Similar News