అలా చేసి ఉంటే సైరస్ మిస్త్రీ బతికేవారా?

టాటా గ్రూపు సంస్థల మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి పారిశ్రామిక వర్గాల్లో విషాదం నింపింది.

Update: 2022-09-05 04:44 GMT

టాటా గ్రూపు సంస్థల మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి పారిశ్రామిక వర్గాల్లో విషాదం నింపింది. ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించడం తెలిసిందే. అయితే వెనక సీట్లో కూర్చున్న సైరస్ మిస్త్రీతో పాటు మరో వ్యక్తి మరణించారు. ఆయన మరణంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. కానీ ముందు సీట్లో కూర్చున్న వారిద్దరూ గాయాలతో బయటపడ్డారు. దీనికి ప్రధాన కారణం సీట్ బెల్ట్ పెట్టుకోవడమేనని నిపుణులు చెబుతున్నారు. బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అనహిత పండోల్ కారును డ్రైవింగ్ చేస్తున్నారు. ఆమె పక్కన జెఎం ఫైనాన్షియల్ ప్రవేట్ ఈక్విటీ మేనేజింగ్ డైరెక్టర్ డారియస్ పండోల్ కూర్చున్నారు. ఇద్దరూ సీటు బెల్టులు పెట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో....
వెనక సీట్లో కూర్చున్న సైరస్ మిస్త్రీ తో సాటు డారియస్ పండోల్ సోదరుడు జహంగీర్ బిన్షా పండోల్ లు మరణించారు. వీరిద్దరూ సీటు బెల్టులు పెట్టుకోలేదంటున్నారు. సీటు బెల్టు పెట్టుకున్నప్పుడే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. లేకుంటే కావు. అతి ఖరీదైన మెర్సిడస్ బెంజ్ కారులో వెనుక వైపు కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇవి తెరుచుకోలేదు. దీనికి కారణం సీటు బెల్టు పెట్టుకోకపోవడమేనని చెబుతున్నారు. వెనక కూర్చున్న ఇద్దరూ సీటు బెల్టులు పెట్టుకోకపోవడంతోనే ప్రమాదంలో మరణించారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.


Tags:    

Similar News