కర్ణాటకలో ఐదు పులుల మృతి
కర్ణాటక రాష్ట్రంలో ఐదు పులులు మరణించిన ఘటన సంచలనం సృష్టించింది
కర్ణాటక రాష్ట్రంలో ఐదు పులులు మరణించిన ఘటన సంచలనం సృష్టించింది. కర్ణాటక ప్రభుత్వంపై దీనిపై సీరియస్ అయి విచారణకు ఆదేశించింది. తమిళనాడు - కేరళ సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక రాష్ట్రం చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలెమహదేశ్వర అటవీ ప్రాంతంలో చనిపోయిన ఐదు పులులు కనిపించాయి. దీంతో స్థానికులు ఇచ్చిన అటవీ సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు ఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
విషం పెట్టడం వల్లనే
విషం పెట్టడం వల్లనే చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. విషం పెట్టి పులులను చంపిన వారు ఎవరన్న దానిపై ఇటు పోలీసులు, అటు అటవీ శాఖ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. ఒక తల్లి పులి, నాలుగు పులి కూనలు మరణించడంతో అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే దర్యాప్తుకు ఆదేశించారు. మూడు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.