Tamilnadu : తమిళనాడు ఊపేస్తున్న దిత్వా
తమిళనాడులో దిత్వా తుపాను విధ్వంసం సృష్టిస్తోంది
తమిళనాడులో దిత్వా తుపాను విధ్వంసం సృష్టిస్తోంది. భారీ వర్షంతో తడిసి ముద్దవుతుంది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వం సబ్‌వేలు మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నై తోపాటు తమిళనాడులోని అనేక జిల్లాలు వణికిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరింది.
విద్యాసంస్థలకు సెలవులు...
ప్రధానంగా చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటంచారు. చెన్నైలో వర్షాలపై ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో సహాయకచర్యలకు ఆదేశించారు. ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.