Breaking: దుల్కర్ సల్మాన్ కు షాక్ ఇచ్చిన కస్టమ్స్ అధికారులు

కేరళలో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి

Update: 2025-09-23 08:02 GMT

కేరళలో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. లగ్జరీ కార్లను దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణలపై కస్టమ్స్ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నారు. వారి నివాసాల్లో సోదాలు నిర్వహించి వాహనాలను ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారన్న దానిపై విచారిస్తున్నారు.

నేపాల్, భూటాన్ నుంచి...
నేపాల్, భూటాన్ నుంచి ఈ లగ్జరీ కార్లను దిగుమతి చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారుల సోదాల్లో వెల్లడయింది. మొత్తం ముప్ఫయి చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్లకు సంబంధించి పన్ను ఎగవేశారన్న ఆరోపణలపై ఈ సోదాలను నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సోదాలు నిర్వహిస్తున్నారు.


Tags:    

Similar News