రైతులకు పెట్టుబడిసాయం రూ.9 వేలు ?

తెలంగాణ, మధ్య ప్రదేశ్ చత్తీస్ ఘడ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తున్నాయి

Update: 2023-08-23 14:18 GMT

రైతులకు పెట్టుబడిసాయం రూ.9 వేలు ?

తెలంగాణ, మధ్య ప్రదేశ్ చత్తీస్ ఘడ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. అలాగే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం రైతులకు రెట్టింపు ఆదాయం లక్ష్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొస్తోంది. ఇప్పటివరకు ఏడాదికి 6 వేల రూపాయల నగదు సాయాన్ని మరో 50 శాతానికి పెంచాలని కేంద్ర యోచిస్తోంది. దీంతో రైతులకు రూ. 9 వేలకు పెంచబోతోంది. దీంతో కేంద్రంపై మరో రూ.30 వేల కోట్ల వరకు అదనపు భారం పడనుంది.

రైతులను ఆకట్టుకునేందుకు కేంద్రం పెట్టుబడి సాయం పెంచబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది ఎంత వరకు అమలులోకి వస్తుందో వేచి చూడాల్సిందే. పీఎం కిసాన్ సాయం పథకాన్ని 2019, ఫిబ్రవరిలో ప్రారంభించారు ప్రధాని ప్రారంభించారు. అ పథకంలో పెట్టుబడి సాయం కింద రూ. 6 వేలుఅందిస్తోంది. ఇప్పటి వరకు 14 విడతల సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేశారు. దేశంలోని 8.5 కోట్ల మంది రైతులు దీనిద్వార ప్రయోజనం పొందుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో అధిక సంఖ్యలో రైతు కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాయి.

Tags:    

Similar News