Vice President : నేడు భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
భారత ఉప రాష్ట్రపతిగా నేడు సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
భారత ఉప రాష్ట్రపతిగా నేడు సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత పదిహేడవ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగే ఈ కార్యక్రమంలో సీపీ రాధాకృష్ణన్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్ర పతులు, మాజీ ప్రదానులు, మాజీ ఉప ప్రధానులను ఆహ్వానించారు.
ఈ నెల9న జరిగిన ఎన్నికల్లో...
అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ నెల 9వ తేదీన జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించడంతో ఆయన తన మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర గవర్నర్ గా అదనపు బాధ్యతలను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు అప్పగించారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరు కానున్నారు.