నామినేషన్ వేసిన రాధా కృష్ణన్
ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు.
ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంటు హౌస్ లో మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మొదటి సెట్ లో మెయిన్ ప్రపోజర్ గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని మోదీ ప్రతిపాదించారు. ఒక్కొక్క సెట్ లో ఇరవై మంది ప్రపోజర్స్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షాతో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
ఎన్డీఏలోని అన్ని పార్టీలకు చెందిన...
వీరితో పాటు ఎన్డీఏకు చెందిన అన్ని పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నారు. ఆయన గతంలో తెలంగాణ ఇన్ ఛార్జి గవర్నర్ పదవిని కూడా చేపట్టారు. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ ఎంపికతో దక్షిణాదికి ప్రాధాన్యత కల్పిస్తున్నామన్న సంకేతాలను బీజేపీ ఇచ్చింది. వచ్చే నెల 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.