Bihar Elections Result : నేడు బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
బీహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది.
బీహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలుగా జరిగిన ఎన్నికలకుసంబంధించి ఈ లెక్కింపు ప్రారంభమవుతుంది. 122 అసెంబ్లీ స్థానాలు వచ్చిన వారు అధికారంలోకి వచ్చినట్లే. మ్యాజిక్ ఫిగర్ ఎవరు చేరతారన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ, మహా ఘట్ బంధన్ లు హోరాహోరీగా ఈ ఎన్నికల్లో పోరాడాయి.
అనేక పార్టీలు...
మొత్తం ఓటర్లు 7.45 కోట్లు ఉన్నాయి. ఇతరులు కూడా ఈ ఎన్నికల్లో ప్రభావితం చేయనున్నారు. ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, ఆజాద్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీలు కూడా బరిలో ఉన్నాయి. మరికొద్ది గంటల్లో బీహార్ విజేత ఎవరన్నది తేలనుంది. ఢిల్లీ బాంబు పేలుడు సందర్భంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.