Breaking : భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ముగిసింది. భారత ఉప రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ముగిసింది. భారత ఉప రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ కు 452 ఓట్లు రాగా, ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. ఈ మేరకు అధికారులు అధికారిక ప్రకటన చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 767 మంది సభ్యులు ఓటు వేశారు. 98.2 శాతం ఓట్లు నమోదయ్యాయని చెప్పారు. ఒకపోస్టల్ బ్యాలట్ పేపర్ వచ్చిందని రాజ్యసభ సెక్రటరీ జనరల్ చెప్పారు. 15 ఓట్లు చెల్లకుండా పోయాయని చెప్పారు.
ఓట్ల తేడాతో...
రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఫలితాలను ప్రకటించారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ జరిగింది. 788 మంది సభ్యులకుగాను 768 మంది పార్లమెంట్ సభ్యులు ఓటేశారు. బీఆర్‌ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ సభ్యులు ఓటు వేయకుండా పోలింగ్ కు దూరంగా ఉన్నారు. ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై నూట యాభై రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు.