భారత్‌లో మళ్లీ కరోనా కలవరం
భారత్‌లో మళ్లీ కరోనా కలవరం మొదలయింది. భారత్ ఇప్పటికే వెయ్యికి పైగా కేసులు దాటాయి
corona virus cases are increasing in india.
భారత్‌లో మళ్లీ కరోనా కలవరం మొదలయింది. భారత్ ఇప్పటికే వెయ్యికి పైగా కేసులు దాటాయి. కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో కేసులు ఒక్కసారిగా పెరిగాయి. అనేక రాష్ట్రాల్లో ఈ కేసులు పెరుగుతుండటంతో ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
కేరళలోనే అత్యధిక కేసులు...
అత్యధికంగా కోవిడ్ కేసులు కేరళలో నమోదయ్యాయి. కేరళలో 430కి యాక్టివ్ కేసులు పెరిగాయి. మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్‌లో 83,తమిళనాడులో 69, కర్నాటకలో 47, యూపీలో 15, పశ్చిమ బెంగాల్‌లో 11 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించింది.