రాజీనామాకు సిద్ధం.. ఎప్పుడంటే?

అమిత్ షాను కలిసిన మాట వాస్తవమేనని, రాజకీయాలపై చర్చించలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

Update: 2022-07-24 06:58 GMT

అమిత్ షాను కలిసిన మాట వాస్తవమేనని, రాజకీయాలపై చర్చించలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తాను రాజీనామా చేస్తానని టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బహిరంగంగానే తాను అమిత్ షాను కలిశానని అన్నార. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల మయంగా చేశారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడులో ఉప ఎన్నికలు ఎందుకు రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందని కేసీఆర్ డ్రామాలాడుతున్నారని అన్నారు.

బీజేపీ వల్లనే సాధ్యం....
తాను రాజీనామా చేస్తే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అంటే తాను రాజీనామాకు సిద్ధమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. దళితబంధుతో పాటు బీసీ, ఎస్సీ బంధు పథకాలను తన నియోజకవర్గానికి ఇస్తే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. హుజురాబాద్ లో పోయిన పరువును మునుగోడులో దక్కించుకోవాలనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. మునుగోడు ప్రాంత అభివృద్ధి కోసం తాను కేసీఆర్ తో పోరాడుతున్నానని తెలిపారు. మునుగోడు నియోజకవర్గానికి నిధులు ఎందుకు కేటాయించారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ను ఓడించాలంటే బీజేపీ వల్లనే సాధ్యమవుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. గతంలోనే ఈ విషయాన్ని తాను తెలిపానన్నారు. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని, మొన్న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థికే ఓటు వేశానని ఆయన తెలిపారు.


Tags:    

Similar News