Rahul Gandhi : నరేందర్.. సరెండర్.. జీ హుజూర్.. రాహుల్ సంచలన కామెంట్స్
ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు
ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఫోన్ బెదిరింపులకు మోదీ లొంగిపోయారని అన్నారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. ఆపరేషన్ ప్రారంభం అయిన వెంటనే ట్రంప్ నుంచి ఆదేశాలు అందడంతో వాటిని వెనక్కు తీసుకున్నారని రాహుల్ గాంధీ అన్నారు.
సరెండర్ కావడం...
క్యా నరేందర్.. సరెండర్ అనగానే జీ హుజూర్ అంటూ నరేంద్ర మోదీ లొంగిపోయారని రాహుల్ గాంధీ అన్నారు. సరెండర్ కావడం బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కు అలవాటు అని అన్నారు. కాంగ్రెస్ సరెండర్ అయ్యే పార్టీ కాదన్నారు. జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రి వంటి నేతలు ఎప్పుడూ ఎవరికి లొంగిపోలేదని ఆయన గుర్తు చేశారు.