69 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తీ!!

చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించింది కేరళకు చెందిన మహిళ.

Update: 2025-07-16 10:15 GMT

చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించింది కేరళకు చెందిన మహిళ. భర్తను కోల్పోయిన ఆమె చదువును మళ్లీ ప్రారంభించారు. పబ్లిక్ వర్క్స్​ డిపార్ట్‌మెంట్ నుంచి హెడ్ క్లర్క్‌గా పదవీ విరమణ పొందిన తర్వాత, ఇంటర్​- డిగ్రీని మంచి మార్కులతో పూర్తి చేశారు. కేరళలోని కాసరగోడ్​లోని వెల్లికోత్​కు చెందిన వీటీ కార్త్యాయని 1971లో ఎస్​ఎస్​ఎల్​సీ పూర్తీ చేసింది. 1972లో బీడీ కార్మికుడు కృష్ణన్​ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె తన చదువును మధ్యలోనే ఆపేశారు. ఖాళీ సమయంలో ఇంగ్లీష్​- మలయాళం టైప్​ రైటింగ్​ నేర్చుకుంటూ ఉండేవారు. 21 సంవత్సరాల వయసులో టైపిస్ట్​గా ఉద్యోగంలో చేరారు. 2011లో రిటైర్​ అయ్యారు. ఆ మరుసటి సంవత్సరం భర్తను కోల్పోయారు. ఆ తర్వాత మళ్లీ చదువుపై దృష్టి పెట్టారు. 62 ఏళ్లలో 83 శాతం మార్కులతో ఇంటర్‌ పూర్తి చేసి, 66 సంవత్సరాల వయసులో కన్నూర్‌ విశ్వవిద్యాలయంలో హిస్టరీ విద్యార్థినిగా చేరారు. 69 ఏళ్ల వయసులో ఫస్ట్‌క్లాస్‌ డిగ్రీని సంపాదించడం విశేషం.

Tags:    

Similar News