అరుణాచలంలో ఏపీ, కర్ణాటక భక్తుల మధ్య కొట్లాట
తమిళనాడులోని అరుణాచలం ఆలయంలో భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఉదయం నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది
తమిళనాడులోని అరుణాచలం ఆలయంలో భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఉదయం నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అయితే క్యూ లైన్ లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక భక్తులమధ్య తోపులాట జరిగింది. దీంతో వాగ్వాదం పెరిగి ఘర్షణకు దారి తీసింది. పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒకరి పరిస్థితి విషమంగాఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
మూడు లైన్ల క్యూ...
అరుణాచలం దర్శనం కోసం వారం రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో పాటు తమకంటే ముందుగా వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని వారించడంతో వాగ్వాదం ప్రారంభమయి చివరకు ఘర్షణకు దారి తీసింది. దర్శనం కోసం మూడ కిలోమీటర్ల మేర క్యూలైన్ విస్తరించి ఉంది. సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుంది.