ఏఏఐబీ నివేదికపై రామ్మోహన్ నాయుడు రెస్పాన్స్ ఇదే

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఏఐబీ ఇచ్చిన ప్రాధమిక నివేదికపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు.

Update: 2025-07-12 07:56 GMT

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్విస్టిగేసన్ బ్యూరో ఇచ్చిన ప్రాధమిక నివేదికపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. విమాన ప్రమాదంపై ఏఏఐబీ ప్రాధమిక నివేదిక ఇచ్చిందని, దానిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

తుది నిర్ణయానికి మాత్రం...
అయితే విమాన ప్రమాదంపై ప్రాధమిక నివేదిక చూసి ఇంకా నిర్ణయానికి వచ్చే అవకాశం లేదని, తుది నివేదిక వచ్చేంత వరకూ వేచిచూడాల్సి ఉంటుందని రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. అయితే ఏఏఐబీ నివేదికను కూడా పరిగణనలోకి తీసుకుంటామని, పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. విశాఖపట్నంలో మంత్రి మీడియాతో మట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


Tags:    

Similar News