Revanth Reddy : నేడు బీహార్ కు రేవంత్ రెడ్డి
ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉన్నారు. నేడు బీహార్ కు వెళ్లి రాహుల్ ఓట్ అధికార్ యాత్రలో పాల్గొననున్నారు
ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఫిరాయింపులపై పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులతో చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలను వచ్చే నెలాఖరులోపు జరపాల్సి ఉన్నందున బీసీ రిజర్వేషన్ల అమలుపై న్యాయపరమైన పోరాటం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
రాహుల్ పాదయాత్రలో...
ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ ను గవర్నర్ రాష్ట్రపతికి పంపారని, ఐదు నెలలయినా దానికి అనుమతి ఇవ్వలేదని, దీనిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. అదే సమయంలో పార్టీ ఫిరాయింపులపై కూడా న్యాయనిపుణులపై చర్చించినట్లు తెలిసింది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్ కు వెళ్లి రాహుల్ గాంధీ ఓట్ అధికార్ పాదయాత్రలో పాల్గొననున్నారు.