Kejrival : నేటితో ముగియనున్న కస్టడీ... ఏం జరగనుంది?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ నేటితో ముగియనుంది

Update: 2024-04-01 03:41 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఈడీ అధికారులు నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. అయితే మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరుపున న్యాయవాదులు కోరే అవకాశముంది. ఐఫోన్ ను సాంకేతిక నిపుణుల చేత దానిని ఓపెన్ చేయించాల్సిన అవసరం ఉందని ఈడీ వాదిస్తుంది.

కస్టడీకి ఇవ్వకుంటే....
గత నెల 22వ తేదీన అరెస్ట్ చేసిన కేజ్రీవాల్ ను ఈడీ ఇప్పటికే పది రోజులు కస్టడీకి కోర్టు అనుమతించింది. అయితే ఈరోజు కస్టడీకి అనుమతించకుండా జ్యుడిషియల్ రిమాండ్ కు ఆదేశిస్తే ఆయనను తీహార్ జైలుకు తరలించే అవకాశముంది. ఇప్పటికే ఇదే కేసులో పలువురు అరెస్టయి తీహార్ జైలులో ఉన్నారు. కాగా ఇప్పటి వరకూ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు.


Tags:    

Similar News