రేపు చంద్రయాన్ -3 సక్సెస్ మీట్, ఎక్కడో తెలుసా ?

ప్రధాని మోడీ శనివారం బెంగుళూరులో చంద్రయాన్ -3 శాస్త్రవేత్తలను కలుసుకొని వారికి అభినందనలు చేయనున్నారు.

Update: 2023-08-25 16:59 GMT

రేపు చంద్రయాన్ -3 సక్సెస్ మీట్

ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ అభినందనలు

ప్రధాని మోడీ శనివారం బెంగుళూరులో చంద్రయాన్ -3 శాస్త్రవేత్తలను కలుసుకొని వారికి అభినందనలు చేయనున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు దిగ్విజయంగా చంద్రుడిపై శాటిలైట్ను పంపిన సందర్భంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇస్రో టెలిమెట్రి, ట్రాకింగ్ , కమాండ్ నెట్ వర్కింగ్ ద్వారా జాతీయ అంతరిక్ష కేంద్ర మైన బెంగళూరు నుంచి గంటసేపు శాస్త్రవేత్తలతో మోడీ ముచ్చటిస్తారు.

బుధవారం చంద్రుడిపై విజయవంతంగా మన అంతరిక్ష నౌక దిగినప్పటి ద్రుష్యాన్ని 15వ బ్రిక్స్ సమావేశానికి హాజరైన ప్రధాని మోడీ జోహన్ బర్గ్ నుంచి తిలకించారు. బీజేపీ వర్గాల సమాచారం మేరకు ప్రధానిని హాల్ (హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) విమానాశ్రయం, జలహల్లి క్రాస్ ల నుంచి పార్టీనేతలు ఆహ్వానం పలుకనున్నారు. గతంలో చంద్రయాన్ -2లోని విక్రమ్ ల్యాండర్ కోసం 2019 సెప్టెంబరు 6న కూడా బెంగుళూరు వెళ్లినప్పటికీ 2.1కిమీ దూరంలో ఇస్రోకు శాటిలైట్ తో సంబంధం తెగిపోయి విఫలం అయిన సంగతి తెలిసిందే.

చంద్రయాన్ -3 కోసం చెల్లిపెళ్లికి వెళ్లలేదు

తమిళనాడుకు చెందిన ప్రాజెక్టు డైరెక్టర్ వీరముత్తువేల్ ఈనెల 20న జరిగిన తన చెల్లివివాహానికి హాజరుకాలేదు. 23న ల్యాండయ్యే శాటిలైట్ కోసం రేయింబవళ్లు కష్టపడ్డారు. చంద్రయాన్ విజయవంతం మా జీవితాల్లో పడ్డ కష్ణానికి ప్రతిఫలం అని ఆయన అన్నారు.

Tags:    

Similar News