ముంబైలో టెన్షన్.. కేంద్రం కీలక నిర్ణయం

మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 15 మంది ఎమ్మెల్యేలకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది

Update: 2022-06-26 07:48 GMT

mumbai : మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. సీఆర్పీఎఫ్ సిబ్బందితో భద్రతను కల్పించింది. రెబల్ ఎమ్మెల్యేల ఆస్తులను శివసైనికులు ధ్వంసం చేస్తుండటంతో వారికి భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఐదుగురు రెబల్ ఎమ్మెల్యే ఇళ్లపై దాడికి దిగారు. ఈరోజు శివసేన కార్యకర్తలు నిరసన ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఆదివారం కావడంతో శివసేన కార్యకర్తలందరూ ర్యాలీగా పార్టీకి చేరుకుంటున్నారు. రెబల్ ఎమ్మెల్యేలు ముంబయి వస్తే తమ తడాఖా చూపిస్తామంటున్నారు.

గవర్నర్ నిర్ణయంపైనే....
వచ్చే నెల 10వ తేదీ వరకూ 144వ సెక్షన్ అమలులో ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం రెబల్ ఎమ్మెల్యేలు గౌహతిలోనే ఉన్నారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కొష్యారీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో గవర్నర్ ను కలిసేందుకు ఏక్‌నాథ్ షిండే రెడీ అవుతున్నారు. మైనారిటీలో పడిన ప్రభుత్వం బలనిరూపణ చేసుకునేలా గవర్నర్ ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయి. గవర్నర్ ఆసుపత్రి నుంచి రావడంతో ఆయన నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.


Tags:    

Similar News