New Aadhar Card : వచ్చే నెలలోనే కొత్త ఆధార్ కార్డు

డిసెంబర్‌లో సరికొత్త ఆధార్ కార్డు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది

Update: 2025-11-24 02:44 GMT

డిసెంబర్‌లో సరికొత్త ఆధార్ కార్డు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. కొత్త ఆధార్ కార్డు ఫోటో మరియు క్యూ ఆర్ కోడ్ ను మాత్రమే కలిగి ఉంటాయి. పేరు, ఆధార్ నంబర్, చిరునామా మరియు పుట్టిన తేదీ వంటి అన్ని వ్యక్తిగత వివరాలు తొలగించనున్నారు. సైబర్ క్రైమ్ పెరిగిన దృష్ట్యా ఈ రకమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది.

క్యూ ఆర్ కోడ్ తో...
క్యూ ఆర్ కోడ్ ఎన్‌క్రిప్టెడ్ రూపంలో అవసరమైన అన్ని సమాచారాన్ని కలిగి ఉంటుంది, దీనిని అధికారిక ధృవీకరణ పద్ధతుల ద్వారా మాత్రమే యాక్సెస్ చేసే వీలుంటుంది. ముఖ్యంగా హోటళ్ళు, కార్యాలయాలు లేదా ఈవెంట్ నిర్వాహకులు కార్డు యొక్క ఫోటోకాపీలను తీసుకొని నిల్వ చేసే పరిస్థితులలో, గోప్యతను పెంచడం మరియు ఆధార్ డేటా దుర్వినియోగాన్ని నిరోధించడం వంటి కారణాలతోనే కొత్త ఆధార కార్డును రూపకల్పన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.


Tags:    

Similar News