Breaking gazette on common civil code : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. గెజిట్ విడుదల

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పౌరస్మృతి సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వం నుంచి గెజిట్ విడుదలయింది.

Update: 2024-03-11 13:00 GMT

gazette on common civil code :కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పౌరస్మృతి సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వం నుంచి గెజిట్ విడుదలయింది. నేటి నుంచి ఉమ్మడి పౌరస్మృతి పౌరసత్వం చట్టం అమలులోకి రాబోతుందని కేంద్ర హోంశాఖ గెజిట్ ను విడుదల చేసింది. నాలుగేళ్ల తర్వాత నేడు ఇది కార్యరూపం దాల్చింది. ఈ చట్టం విధివిధానాలను, అమలు నిబంధనలను కూడా ప్రకటించింది. ఉమ్మడి పౌరసత్వం చట్టం నేటి నుంచి భారత్ లో అమలులోకి రానుంది.

అందరికీ పౌరసత్వం...
ఉమ్మడి పౌరసత్వం చట్టం 2019 డిసెంబరు 11వ తేదీన పార్లమెంటులో ఆమోదం పొందింది. ఈ చట్టాన్ని రాష్ట్రపతి కూడా ఆమోదించారు. అయితే ఇంత వరూకూ దీనిపై నిబంధనలను అమలు పర్చలేదు. దీనిప్రకారం 2014కు ముందు భారత్ కు వచ్చిన వారందరికీ భారత పౌరసత్వం లభించనుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ చట్ట సవరణను ఆమోదిస్తూ నేడు ఆప్ఫగిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాలలో హింసకు గురై భారత్ కు వచ్చిన హిందువులు, క్రైవ్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు ఈ చట్టం వర్తించనుంది.


Tags:    

Similar News