Election Commission : నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదల.. లోక్‌సభ‌తో పాటు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్

సారస్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్వి నేడు విడుదల చేయనుంది

Update: 2024-03-16 03:12 GMT

ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. నేటి నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు సారస్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదలవుతుంది. లోక్‌సభ ఎన్నికతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ కూడా నేడు విడుదల కానుంది.

ఎన్నిక ఎప్పుడనేది?
ఈ మీడియా సమావేశంలోనే ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నది తేలనుంది. 18వ లోక్‌సభకు సంబంధించి వివిధ దశల్లో ఎన్నికలను కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించనుంది. భద్రత సిబ్బందిని వినియోగించుకోవడం కోసం దశల వారీగా ఎన్నికలను నిర్వహిస్తుంది. గత ఎన్నికల్లో ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ం రాజీవ్ కుమార్ ఈ షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే గత ఎన్నికల షెడ్యూల్ కంటే ఆరు రోజులు ఆలస్యం కావడంతో ఎప్పుడు ఏ తేదీన ఏ రాష్ట్రంలో ఎన్నిక నిర్వహించనున్నదీ నేడు తేలనుంది.
ఒకేసారి ఎన్నికలంటూ...
అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా చూడాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు అందాయి. రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండటంతో తెలంగాణలో లోక్‌సభ, ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకే తేదీన నిర్వహించాలంటూ అధికార వైసీపీ కోరుతుంది. మరోవైపు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలంటే అవసరమైన భద్రత సిబ్బంది, ఎన్నికల అధికారులు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోనుంది.


Tags:    

Similar News