మూడు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్

నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను ప్రకటించింది

Update: 2023-01-19 02:15 GMT

నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. మూడు రాష్ట్రాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లన విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. మూడు చిన్న రాష్ట్రాల్లోనూ ఒకే దశలో ఎన్నికలను నిర్వహిస్తామని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలింగ్ ను వేర్వేరు తేదీల్లో నిర్వహించనున్నారు.

ఒక దశలోనే....
మార్చి 2న ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేలా నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని రాజీవ్ కుమార్ తెలిపారు. త్రిపురలో ఈ నెల 21న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్లకు ఆఖరి గడువు జనవరి 30వ తేదీగా నిర్ణయించారు. ఫిబ్రవరి 16న పోలింగ్ జరగనుంది. ఇక నాగాలాండ్, మేఘాలయలో జనవరి 31వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్లకు ఫిబ్రవరి 7వ తేదీ ఆఖరితేదీగా నిర్ణయించారు. ఫిబ్రవరి 27న రెండు రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్ ను నిర్వహిస్తారు. మార్చి 2న కౌంటింగ్ జరుగుతుందని రాజీవ్ కుమార్ తెలిపారు.


Tags:    

Similar News