గాలి జనార్థన్ రెడ్డి పై కేసు నమోదు

బళ్లారి కాల్పుల ఘటనలో 11 మందిపై కేసులు నమోదయ్యాయి

Update: 2026-01-02 04:47 GMT

బళ్లారి కాల్పుల ఘటనలో 11 మందిపై కేసులు నమోదయ్యాయి. నిన్న రాత్రి బ్యానర్లు కడుతుండగా జరుగుతున్న ఘర్షణలో కాల్పులు జరిగి ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బళ్లారి పోలీసులు మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్‌రెడ్డి సహా పదకొండు మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బళ్లారి కాల్పుల ఘటనలో...
మోత్కార్ శ్రీనివాస్‌, ప్రకాష్‌రెడ్డి, రాముడు, పలన్న, దివాకర్‌, మారుతిప్రసాద్‌, దమ్మూర్‌ శేఖర్‌, అలీఖాన్‌పై కేసులు నమోదయ్యాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బళ్లారిలో నేడు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News