కర్ణాటకలో మంకీపాక్స్ కేసు నమోదు
భారత్ లో మంకీపాక్స్ కేసు నమోదయింది. దుబాయ్ నుంచి కర్ణాటకకు వచ్చిన ఒకరికి ఈ వ్యాధి సోకింది
భారత్ లో మంకీపాక్స్ కేసు నమోదయింది. దుబాయ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు వెల్లడికావడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈ నెల 17న దుబాయ్ నుంచి కర్ణాటక లోని మంగళూరుకు వచ్చిన ఒక ప్రయాణికుడి ఒంటిపై దుద్దుర్లు, జ్వరంతో పాటు మంకీ పాక్స్ లక్షణాలు కనిపించాయి. వెంటనే అతనని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు.
ప్రభుత్వం అప్రమత్తం...
ఆసుపత్రి వైద్యులు బాధితుడి లక్షణాలపై అనుమానం రావడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమయింది. బాధితుడి రక్తనమూనాలను పూనేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు పంపారు. అక్కడ మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఐసొలేషన్ లో ఉంచి బాధితుడికి చికత్స అందిస్తున్నారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, మంకీ పాక్స్ అంత ప్రమాదం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.