ఈ నెల 28 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

ఈ నెల 28 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి

Update: 2026-01-10 03:42 GMT

ఈ నెల 28 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు తొలిదశ సమావేశాలు జరగనున్నాయి.ఫిబ్రవరి 1 ఆదివారం రోజున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. వరసగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే సిద్ధం చేస్తున్నార.

ఆదాయపు పన్నుపై...
బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ పై చర్చ జరగనుంది. రెండు సభల్లో బడ్జెట్ పై చర్చ జరగనుంది. ఈసారి బడ్జెట్ లో ఏ ఏ రాష్ట్రాలకు, ఏ రంగాలకు అధిక ప్రాథాన్యత ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆదాయపు పన్నులో మరింత వెసులు బాటు కల్పించే విధంగా తీసుకునే అవకాశాలున్నాయని తెలిసింది. మార్చి 9వ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు రెండో దశ పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి.


Tags:    

Similar News