నేటి నుంచి అరుణాచలంలో బ్రహ్మోత్సవాలు

అరుణాచలంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి

Update: 2026-01-07 03:16 GMT

అరుణాచలంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 2026 అరుణాచలం ఉత్తరాయణం పుణ్యకాలం ప్రవేశం తో అరుణాచలేశ్వరునికి బ్రహ్మోత్సవాలు ఈరోజు ఉదయం ధ్వజారోహణం జరగనుంది. అనంతరం బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అరుణాచలం బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశాలున్నాయని భావించి అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉత్తరాయణ పుణ్యకాలంలో...
ప్రతి ఆలయానికి సంవత్సరానికి ఒక సారే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకం ప్రతి ఏటా నాలుగు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించే క్షేత్రం ఒక్క అరుణాచలం లోనే జరుగుతుంది. ఉత్తరాయణం లో రెండు సార్లు దక్షణాయణం లో రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్తరాయణ ప్రవేశ కాలంలో ఒకసారి "చిత్ర మాసం" లో 'వసంత నవరాత్రి ఉత్సవాలు...' దక్షిణాయనం ప్రవేశ కాలం లో ఒకసారి "కార్తీక మాసం"లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.


Tags:    

Similar News