పార్లమెంటు ఉభయ సభలు వాయిదా

పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి

Update: 2025-07-23 05:48 GMT

పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయిన తర్వాత ఉభయ సభల్లో విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. బీహర్ లో ఓటర్ల జాబితా సవరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాల్సిందేనంటూ పట్టుబట్టారు. లోక్ సభలో స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేశారు.

విపక్షాలు పట్టుబట్టడంతో...
దీంతో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ వాయిదా వేశారు. తర్వాత లోక్ సభ బయట విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. రాజ్యసభలోనూ సభ్యులు ఆందోళనకు దిగారు. వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టారు. దీంతో సభ ఛైర్మన్ రాజ్యసభను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేశారు.


Tags:    

Similar News