సినీ ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు

తమిళనాడులో సినీ ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి

Update: 2025-11-05 02:40 GMT

తమిళనాడులో సినీ ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అందరి ఇళ్లలో తనిఖీలు చేశారు. బాంబు స్క్కాడ్ లు వచ్చి క్షుణ్ణంగా పరిశీలించారు. తమిళనాడులో ఉన్న సినీనటి త్రిష, నటుడు విశాల్, దర్శకుడు మణిరత్నం ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఈ మెయిల్ రావడంతో...
చెన్నై డీజీపీ కార్యాలయానికి ఈ-మెయిల్‌లో రావడంతో చెన్నైలో ఉన్న నటి త్రిష, నటుడు విశాల్, దర్శకుడు మణిరత్నం ఇళ్లలో బాంబులు ఉన్నట్లు ఉంది. వెంటనే బాంబు స్క్వాడ్‌ వారి నివాసాల్లో తనిఖీ చేపట్టింది. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై విచారణ చేస్తున్నారు.


Tags:    

Similar News