హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు
కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.
కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కువైట్ నుంచి హైదరాబాద్ కు వస్తున్నఇండిగో విమానానికి ఈ బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అత్యవసరంగా ముంబయికి విమానాన్ని దారి మళ్లించారు. ముంబయి ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
కువైట్ నుంచి...
కువైట్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఇండిగో విమానంలో మానవ బాంబు ఉందంటూ బెదిరింపు రావడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ముంబయిలో విమానంలో గాలింపు చర్యలు చేపట్టారు. వరసగా ఇటీవల విమానాలకు బాంబు బెదిరింపులు రావడం సాధారణంగా మారింది. ముంబయి చేరుకున్న విమానంలో బాంబుస్క్వాడ్ తనిఖీలను చేపట్టారు. ప్రయాణికులను కిందకు దించి విమానాన్ని పరిశీలిస్తున్నారు