1000 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ భద్రంగా బ్లాక్ బాక్స్
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తులో కీలకమైన బ్లాక్ బాక్స్, డిజిటల్ వీడియో రికార్డర్ ని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తులో కీలకమైన బ్లాక్ బాక్స్, డిజిటల్ వీడియో రికార్డర్ ని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానం పేలిపోయినప్పుడు అందులోని ఇంధనం కారణంగా ఏకంగా 1,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వెలువడింది. విమానం మొత్తం మంటల్లో చిక్కుకుంది.
భారీ ఉష్ణోగ్రతలోనూ
భారీ ఉష్ణోగ్రతలోనూ బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉంది. టైటానియం లేదా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో బ్లాక్‌బాక్స్ తయారు చేస్తారు. ఇది 1100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో పాటు అత్యధిక ఒత్తిడిని సైతం తట్టుకోగలదు. నీటిలో 6 వేల మీటర్ల లోతున కూడా 30 రోజులపాటు భద్రంగా ఉంటుంది.