చిన్నమ్మతో విజయశాంతి భేటీ.. అందుకేనట

బీజేపీ నేత విజయశాంతి తమిళనాడు అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళను కలిశారు

Update: 2022-02-03 02:02 GMT

బీజేపీ నేత విజయశాంతి తమిళనాడు అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళను కలిశారు. వీరిద్దరి భేటీ తమిళనాడు రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఐదేళ్ల పాటు జయలలిత అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన శశికళ బయటకు వచ్చిన తర్వాత రాజకీయాలకు గుడ్ బై ప్రకటించారు. కానీ అన్నాడీఎంకే ఓటమి పాలు కావడంతో తిరిగి ఆమె యాక్టివ్ అయ్యారు. అన్నాడీఎంకే నేతలను కలుస్తున్నారు.

ఆర్థికపరమైన....
అయితే తెలంగాణలో బీజేపీ నేత విజయశాంతి శశికళను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నాడీఎంకేను తిరిగి సొంతం చేసేందుకు న్యాయపరంగా శశికళ ప్రయత్నిస్తున్నారు. క్యాడర్ నుంచి నేతలు కూడా చిన్నమ్మ రాకను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళను విజయశాంతి కలవడంలో పెద్దగా ప్రాధాన్యమేమీ లేదని, ఆర్థిక పరమైన విషయాలు చర్చించేందుకు అయి ఉండవచ్చన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి.


Tags:    

Similar News