ఈశాన్యంలో కమల వికాసమే

ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో కమలం పార్టీకి అనుకూన ఫలితాలు లభించాయి. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు అనుగుణంగానే రిజల్ట్ వచ్చాయి

Update: 2023-03-02 11:21 GMT

ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో కమలం పార్టీకి అనుకూన ఫలితాలు లభించాయి. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు అనుగుణంగానే రిజల్ట్ వచ్చాయి. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. త్రిపుర, నాగాలాండ్ లో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. మేఘాలయలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగానే హంగ్ అసెంబ్లీ ఏర్పడింది.

ఇక్కడ హంగ్...
అయితే మేఘాలయలో సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీకి ఎక్కువ స్థానాలు వచ్చినా మెజారిటీ స్థానాలు దక్కలేదు. ఇక్కడ మొత్తం అరవై స్థానాలుండగా ఎన్‌పీపీకి 27 స్థానాలకు మాత్రమే వచ్చాయి. ఇతరులు 21 మంది గెలిచారు. ఇక్కడ బీజేపీ రెండు, టీఎంసీ ఐదు స్థానాలను గెలుచుకుంది.
త్రిపురలోనూ...
త్రిపురలో అరవై అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 33 స్థానాల్లో బీజేపీ, పథ్నాలుగు స్థానాల్లో వామపక్ష పార్టీు, తిష‌రా మోధా పార్టీకి 13 స్థానాలు దక్కాయి. ఇక నాగాలాండ్ లోనూ అరవై స్థానాలుండగా ఎన్‌డీపీపీ- బీజేపీ కూటమికి 38 స్థానాలు దక్కించుకుని మరోసారి అధికారంలోకి రానుంది. ఇక్కడ ఎన్‌పీపీ 2, ఎన్‌పీఎఫ్ కు రెండు, ఇతరులు 16 మంది విజయం సాధించారు. మొత్తానికి మూడు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది.


Tags:    

Similar News