హాఫ్ సెంచరీ కొట్టేసిన కమలం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇప్పటికే యాభై స్థానాల్లో ముందంజలో ఉంది

Update: 2025-02-08 04:23 GMT

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇప్పటికే యాభై స్థానాల్లో ముందంజలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 20 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమయింది. ఈ ట్రెండ్ చూస్తుంటే బీజేపీ భారీ ఆధిక్యతతో అధికారంలోకి వచ్చే అవకాశముందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

26 ఏళ్ల తర్వాత...
26 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ స్థానాలలో బీజేపీ అధికారంలోకి వస్తుండటంతో కమలనాధులు ఖుషీ అవుతున్నారు. స్వీట్లు పంచుకున్నారు. ఓట్ల షేరింగ్ లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తుంది. బీజేపీకి యాభై రెంండు శాతం ఓట్లతో ఉండగా, కాంగ్రెస్ నలభై శాతం ఓట్లతో ఉంది. కాంగ్రెస్ కు ఆరు శాతం ఓట్లు వచ్చాయి.


Tags:    

Similar News