Bihar : బీహార్ లో ప్రశాంత్ కిషోర్ పార్టీ బోణీ

బీహార్ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్ కు చెందిన జన్ సురాజ్ పార్టీ మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది

Update: 2025-11-14 04:01 GMT

బీహార్ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్ కు చెందిన జన్ సురాజ్ పార్టీ మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. కొత్త పార్టీ పెట్టి ఆయన జనంలోకి వెళ్లారు. బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అనేక సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.

మూడు అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యత...
అయితే ప్రశాంత్ కిషోర్ తొలి నుంచి ఒక మాట చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు తమకు ముఖ్యం కాదని, రాజకీయాల్లో మార్పు కోసమే వచ్చానంటూ ప్రశాంత్ కిషోర్ జనంలోకి వెళ్లారు. దీంతో ఇప్పటి వరకూ మూడు స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతుంది. మిగిలిన చోట్ల కూడా కొంత ఓటు షేర్ సంపాదిస్తుందని కౌంటింగ్ సరళి వెల్లడిస్తుంది. యువత ఎక్కువగా జనసురాజ్ పార్టీ వైపునకు మొగ్గు చూపారన్నది విశ్లేషకుల అంచనా.


Tags:    

Similar News