Bihar : బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఎప్పుడంటే?
అక్టోబర్ మొదటి వారంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తులు చేస్తోంది
అక్టోబర్ మొదటి వారంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తి కావస్తుంది. ఈ నెల 30 నాటికి తుది ఓటర్ల జాబితాల ప్రకటనను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది.
జూబ్లీ హిల్లస్ ఉప ఎన్నిక కు...
బీహార్ శాసనసభ ఎన్నికలకు గడువు పూర్తి కావస్తుండటంతో కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశముంది. బీహార్ శాసనసభ ఎన్నికలను రెండు దశల్లో జరపనున్నట్లు సమాచారం. వీటితో పాటు దేశంలో ఖాళీగా వున్న అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు కూడా అక్టోబర్ మొదటివారంలోనే షెడ్యూల్ వెలువడనుంది. తెలంగాణాలోని జూబ్లీహిల్స్ సహా దేశంలో ఖాళీగా పలు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు కూడా వచ్చే నెల మొదటి వారంలో కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేయనునుంది.