Tamilnadu : తమిళనాడులో సీబీఐ బృందం

తమిళనాడు కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు రెండో రోజు కూడా కొనసాగుతుంది

Update: 2025-11-01 04:42 GMT

తమిళనాడు కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు రెండో రోజు కూడా కొనసాగుతుంది. పది మంది సీబీఐ అధికారుల బృందం శనివారం 3డీ లేజర్‌ స్కానర్‌తో ప్రదేశం కొలతలు, మాపింగ్‌ పనులు నిర్వహించింది. ఈ టెక్నాలజీతోనే శుక్రవారం 300 మీటర్ల మేర ప్రాంతాన్ని స్కాన్‌ చేశారు. తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్‌ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోవడంతో, సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఆరుగురు సీనియర్‌ అధికారులు శుక్రవారం మళ్లీ కరూర్ కు చేరుకుని విచారణను చేపట్టారు.

కరూర్ లో జరిగిన....
అక్టోబర్‌ 27న టీవీకే అధినేత విజయ్‌ పాల్గొన్న సభలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం సీబీఐ అక్టోబర్‌ 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ప్రాథమిక విచారణ జరిపింది. దీపావళి పండగ సందర్భంగా వాయిదా వేసిన విచారణ తిరిగి ప్రారంభించింది. అక్టోబర్‌ 21 నుంచి ఇన్‌స్పెక్టర్‌ మనోకరన్‌, ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్మెంట్‌ అతిథి గృహంలో ఉండి, కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్నారు. . రాబోయే రోజుల్లో విచారణ మరింతగా వేగం సంతరించుకునే అవకాశముందని వర్గాలు చెబుతున్నాయి.


Tags:    

Similar News