BJP : నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం.. ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై?
నేడు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించనుంది.
నేడు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించనుంది. ఉప రాష్ట్ర పతి అభ్యర్థి ఎంపికను పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చించి నిర్ణయించనున్నారు. ఈ నెల 25వ తేదీ వరకూ నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ఉండటంతో అభ్యర్థి పేరును ఖరారు చేయనున్నారు.
పోటీ ఉన్నప్పటికీ...
ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాతో ఏర్పడిన ఉప రాష్ట్రపతి అభ్యర్థి పదవికి వచ్చే నెల 9వ తేదీన ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో ఇండి కూటమి కూడా పోటీ చేసే అవకాశముంది. అందుకే అభ్యర్థి ఎంపిక విషయంలో ఎన్డీఏ ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించింది. అయితే పార్లమెంటు ఉభయ సభల్లో ఎన్టీఏ బలంగా ఉండటంతో అది ఖరారు చేసే అభ్యర్థి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.